Skip to main content

UPSC ESE 2025 Exam: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

UPSC Engineering Services Exam 2025 Notification   Central Government Job Vacancies through UPSC 2025  Engineering Services Exam Vacancies in Railway, Telecom, and Defense Services Eligible Candidates Apply for UPSC Engineering Services 2025 UPSC Exam 2025 for Engineering Job Vacancies UPSC ESE 2025 Exam UPSC Engineering Services Exam 2025 UPSC Engineering Services Exam 2025 Apply Now for 232 Posts
UPSC ESE 2025 Exam UPSC Engineering Services Exam 2025 UPSC Engineering Services Exam 2025 Apply Now for 232 Posts

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ),‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 232
ఖాళీల విభాగాలు

  • సివిల్‌ ఇంజనీరింగ్‌ 
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణత లేదంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. 

North Central Railway Notification: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1659 ఖాళీలు, దరఖాస్తుకు ఇదే చివరి తేది

వయస్సు: జనవరి 1, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

AIIMS Mangalagiri Recruitment 2024: ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఎంపిక

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 09, 2025

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 08, 2024

Published date : 20 Sep 2024 08:57AM
PDF

Photo Stories