Skip to main content

UPSC - ESE 2025 : యూపీఎస్సీ-ఈఎస్ఈ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ విభాగాల్లో ద‌ర‌ఖాస్తులు..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ESE notification 2025 for engineering jobs in different branches  UPSC Engineering Services Examination 2025 notification  Engineering jobs announcement by UPSC  Application details for UPSC Engineering Services Examination 2025  UPSC Engineering Jobs in Railway, Telecom, and Defense Services

»    మొత్తం ఖాళీల సంఖ్య: 457.
»    అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్శిటీ బీఈ/బీటెక్‌ చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌(ఇండియా) ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జామినేషన్స్‌ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ ఎగ్జామినేషన్‌ పార్ట్స్‌ 2/3 సెక్షన్లు ఎ, బి అర్హత ఉండాలి.  లేదా ఎలక్ట్రానిక్స్‌–టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(ఇండియా) గ్రాడ్యుయేట్‌ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. » వయసు: 01.01.2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    ఎంపిక విధానం:స్టేజ్‌–1(ప్రిలిమినరీ/స్టేజ్‌–1) ఎగ్జామ్,స్టేజ్‌–2(మెయిన్‌/స్టేజ్‌–2)ఎగ్జామ్, స్టే జ్‌–3(పర్సనాలిటీ టెస్ట్‌),మెడికల్‌ ఎగ్జామినేష­న్,సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.11.2024
»    దరఖాస్తు సవరణ తేదీలు: 23.11.2024 నుంచి 29.11.2024 వరకు.
»    ప్రిలిమినరీ/స్టేజ్‌–1 పరీక్ష తేది: 09.02.2025.
»    వెబ్‌సైట్‌: https://upsc.gov.in

SRFTI Jobs : ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ కోల్‌కతాలో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు!

Published date : 22 Oct 2024 12:01PM

Photo Stories