Skip to main content

AU Weekend Classes : ఏయూలో వారాంత‌పు త‌ర‌గ‌తుల షెడ్యూల్ విడుద‌ల‌.. తేదీలివే..!

Weekend classes at andhra university for distance education students

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య 2024-25 విద్యాసంవత్సరం బ్యాచ్‌లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం బీఏ, బీకాం మొద‌టి సంవత్సరంలో 1వ‌, 2వ సెమిస్టర్ వారాంతపు తరగతులు రేప‌టి నుంచి నిర్వహిస్తామని ఏయూ స్టడీ సెంటర్‌ కో ఆర్డినేటర్‌, మహరాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.జనార్దన నాయుడు ఒక ప్రకనటలో తెలిపారు.

Model Schools Admissions 2025 : మోడ‌ల్ స్కూళ్ల‌లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..!

మొత్తం పది రోజుల పాటు నిర్వహించే ఈ తరగతుల తేదీ షెడ్యూల్‌ను ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. రేపు అంటే, డిసెంబ‌ర్ 22వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు వారాంతపు రోజుల్లో తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డులతో స్టడీ సెంటర్‌కు వచ్చి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 9492021464 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Dec 2024 02:58PM

Photo Stories