Electricity Department Job Notification : గుడ్‌న్యూస్...తెలంగాణ విద్యుత్ శాఖలో 3,260 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో త్వరలోనే కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)లో 2,212 జేఎల్‌ఎం (జూనియర్ లైన్‌మెన్), 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్‌ల (ఎలక్ట్రికల్, సివిల్)తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL)లో 600 జూనియర్ లైన్ మెన్ (జేఎల్‌ఎం), 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
Electricity Department Job Notification
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఐటీఐ చేసిన వారు జేఎల్‌ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్, బీఈ/బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం.