Outsourcing Job Notification: డిగ్రీ అర్హతతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు జిల్లా మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో టీజీటీ సైన్స్ పురుషులకు ఒక పోస్ట్, తొర్రూర్ బాలికల మైనార్టీ పాఠశాలలో టీజీ టీ ఇంగ్లిష్ పోస్ట్(మహిళ), డోర్నకల్ మైనార్టీ గురుకుల కళాశాలలో హెచ్‌పీ పోస్ట్(మహిళ ), బాలికల కళాశాలలో అనాటమి ఫిసియోలజి పోస్ట్ (మహిళ) ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
Outsourcing Job Notification
బీఈడీ పూర్తి చేసి, నాలుగు సంవత్సరాల బోధన అనుభవంగల వారు అర్హులని, ఈ నెల 10 నుంచి 18 వరకు సన సెక్యూరిటీ ప్లే స్‌మెంట్ ఏజెన్సీ తాళ్లపూసపల్లి రోడ్డులోని కార్యాలయంలో బయోడేటా, విద్యార్హత జిరాక్స్ పత్రాలను అందజేయాలని తెలిపారు. సందేహాలుంటే చిరంజీవిని 90521 74603 నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.