Skip to main content

Priyanka Tare: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్‌ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Telangana Queen Priyanka Tare in Mrs India Competition

చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్‌ ఇండియా తెలంగాణ క్వీన్‌ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్‌ ప్యాషనేట్‌ అవార్డు గెలుచుకుంది. 

ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్‌ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్‌సీసీలో హెచ్‌ఆర్‌, సీఎస్‌ఆర్‌గా పలు ఈవెంట్‌లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు. 
 
ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్‌జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది.

Miss India USA: మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి

Published date : 18 Mar 2025 06:17PM

Photo Stories