Skip to main content

Food Facility for Students : విద్యార్థుల ఆక‌లి కేక‌లు.. ఆగ్ర‌హంలో త‌ల్లిదండ్ర‌లు..

జిల్లాలోని 70 సర్కారు బడుల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ బడుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంది.
Lack of food facility for tenth exam students

చిత్తూరు: జిల్లావ్యాప్తంగా పదో త‌ర‌గ‌తి ప‌బ్లిక్‌ పరీక్ష కేంద్రాలుగా మారిన‌ ప్రభుత్వ పాఠశాలల్లో.. సోమవారం విద్యార్థులు ఆకలి కేకలు పెట్టాల్సి వచ్చింది. జిల్లాలోని 70 సర్కారు బడుల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ బడుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలంటే ఉదయం నుంచి కార్మికులు బడుల్లోనే వంట చేయాల్సి వస్తుంది.

Social Work Day : మ‌హిళా వ‌ర్సిటీలో ఘ‌నంగా సోష‌ల్ వ‌ర్క్ డే.. ఈ విష‌యాపై అవ‌గాహ‌న‌..

అయితే పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పోలీసులు వంట మనుషులను లోనికి అనుమతించని పరిస్థితి ఏర్పడ‌గా.. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం పాఠశాలలకు వచ్చే విద్యార్థుల కోసం భోజనం ఎక్కడ వండాలో తెలియ‌కుండా పోయింది. 

విద్యాశాఖ ఆదేశాలు..

ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. సమీపంలోని ప్రాథమిక పాఠశాల, వసతి గృహాలుంటే అక్కడ మధ్యాహ్నభోజనం తయారు చేయించాలని సూచించారు.

Half Day for Anganwadi Centers : అంగ‌న్వాడీల‌కూ ఒంటిపూట ప్రారంభం.. టీచ‌ర్ల‌కు, ఆయాల‌కు కూడా..

దీంతో అప్పటికప్పుడు ప్రాథమిక పాఠశాలలు, వసతి గృహాల్లో వంట చేసుకుని ఆటోల్లో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వడ్డించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులకు ఆహారం అందక పస్తులుండాల్సి పరిస్థితి నెల‌కొంది. దీంతో విద్యాశాఖ అధికారులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Mar 2025 12:27PM

Photo Stories