New Predator: పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవిని గుర్తించిన సైంటిస్టులు
మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. ఇటీవల, దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్రతీరంలో ఒక కొత్త జీవి గుర్తించబడింది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు.
యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు.
Highest Temperature: అత్యంత ఉష్ణోగ్రత నమోదైన తొలి ఏడాది 2024.. ఎందుకింత వేడి?
ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం.
మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి.
Andromeda Galaxy: నక్షత్ర మండలంలో తొలిసారి పరారుణ ఉద్గారాల గుర్తింపు