Skip to main content

Andromeda Galaxy: సువిశాల విశ్వంలో అనేకంగా ఉన్న గెలాక్సీలు

సువిశాల విశ్వంలో గెలాక్సీలు(నక్షత్ర మండలాలు) అనేకంగా ఉన్నాయి.
ISRO AstroSat Discovers Eruptive Events Within Andromeda Galaxy

వాటిలో మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఇటీవల బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) బృందం ఆండ్రోమెడా గెలాక్సీలో ఒక అరుదైన దృశ్యాన్ని కెమెరా ద్వారా బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్‌వై అంటారు.

తొలిసారి గుర్తింపు..
ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్‌వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (UVIT) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్‌వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. 

భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్‌ రియాక్షన్‌ జరుగుతుంది. 

PSLV-C59 Rocket: ‘ప్రోబా-3’ మిషన్ ప్రయోగం సూపర్‌ సక్సెస్

దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్‌వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్‌ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్‌ జర్నల్‌లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. 

నోహ్‌వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్‌–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. నోహ్‌వై రహస్యాలపై మరింత పరిశోధనలు, భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్-రే మిషన్ల ద్వారా జరగనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

New Fish Species: మూడు కొత్త ర‌కం చేపలను క‌నుగొన్న శాస్త్రవేత్తలు.. ఇవి క‌నిపించేది ఈ రాష్ట్రాల్లోనే..

Published date : 09 Dec 2024 03:09PM

Photo Stories