New Fish Species: మూడు కొత్త రకం చేపలను కనుగొన్న శాస్త్రవేత్తలు
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్‌తో పాటు కల్సుబాయి, రాధానగర్ అభయారణ్యాల్లో తాజా జూలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా (JRSI) పరిశోధకులు మూడు కొత్త చేపల జాతులను గుర్తించారు. ఈ చేపల జాతులు ఇండోరియోనెక్లైస్ వర్గానికి చెందినవిగా ఉంటాయి. కానీ వాటి లక్షణాలు వేరుగా ఉండడంతో వాటికి ప్రత్యేకమైన పేర్లను ఇచ్చారు.
తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని చేప: ఈ చేపను ఇండోరియోనెక్లెస్ ఆమ్రాబాద్ అని పేరు పెట్టారు. ఇది కేవలం అమ్రాబాద్ ప్రాంతంలో మాత్రమే లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కల్సుబాయి అభయారణ్యంలోని చేప: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఉన్న కల్సుబాయి అభయారణ్యంలో ఈ చేపను గుర్తించారు. దీనికి ఇండోరియోనెక్లెస్ కల్సుబాయి అని పేరు పెట్టారు.
World’s Largest Coral: ప్రపంచంలో అతిపెద్ద పగడం గుర్తింపు
రాధానగరి అభయారణ్యంలోని చేప: మహారాష్ట్రలోని రాధానగరి అభయారణ్యంలో ఓ నదీ ప్రవాహంలో ఈ చేపను గుర్తించారు. దీనికి ఇండోరియోనెక్లెస్ రాధానగరి అని పేరు పెట్టారు.
ఇండోరియోనెక్లైస్ వర్గానికి చెందిన చేపలు సాధారణంగా గోదావరి, కృష్ణా, కావేరి నదీ వ్యవస్థలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చేపలు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. 2020లో.. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వేలో ఇండోరియోనెక్లెస్ తెలంగాణెన్సిస్ కవ్వాల్ టైగర్ రిజ ర్వేలో కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ రకానికి చెందిన ఆరు జాతుల చేపలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
Cheetah Project: రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య చిరుత కరిడార్ మేనేజ్‌మెంట్ కమిటీ