Skip to main content

Gaganyaan: 'గగన్‌యాన్‌' ప్రాజెక్టుకు పదేళ్లు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా మానవ రహిత ప్రయోగం నిర్వహించేందుకు డిసెంబ‌ర్ 18వ తేది రాకెట్ తొలి దశ అనుసంధానం పనులు ప్రారంభించింది.
ISRO starts Gaganyaan uncrewed mission campaign exactly 10 years after CARE Re-entry Experiment

సతీశ్ థవన్ స్పేస్ సెంటర్‌లోని 2వ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో ఉదయం 8.45 గంటలకు రాకెట్‌కు సంబంధించిన ఎస్-200 మోటార్ సెగ్మెంట్‌ను శాస్త్రవేత్తలు అనుసందానం చేశారు.

ఈ రాకెట్‌ మూడు దశల్లో పనిచేసి, 10 టన్నుల పేలోడ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని పొడవు 53 మీటర్లు, బరువు 640 టన్నులు. ఈ రాకెట్‌ ద్వారా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి, తిరిగి భూమిపై సురక్షితంగా తీసుకురావడం లక్ష్యం.

గగన్‌యాన్ ప్రాజెక్టుకు పదేళ్లు
గగన్‌యాన్ కోసం పదేళ్ల కిందట 2014 డిసెంబర్ 18న 3,775 కిలోల బరువు కలిగిన క్రూ మాడ్యూల్‌ను ఎల్‌వీఎం3-ఎక్స్ కేర్‌ మిషన్ అనే రాకెట్ ద్వారా షార్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించగా.. పదేళ్ల తర్వాత మళ్లీ అదే రోజున ఇస్రో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగు వేసింది.  

గగనా యాన్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు పదేళ్లుగా ఎన్నో పరీక్షలు నిర్వహించిన ఇస్రో.. ఇప్పుడు హెచ్ఎల్‌వీఎం8-జీ1 పేరుతో మొదటి ప్రయోగానికి సిద్ధమవుతోంది.

అప్పట్లో ఎల్‌వీఎం3-ఎక్స్‌ కేర్‌ మిషన్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌.సోమనాథ్.. ఇప్పుడు ఇస్రో చైర్మన్‌ హోదాలో ఉన్నారు.

PSLV-C60: త్వ‌ర‌లో పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగం

Published date : 19 Dec 2024 04:47PM

Photo Stories