PSLV-C60: డిసెంబర్ 30వ తేదీ పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగం
Sakshi Education
ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9.30 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువు కలిగిన అత్యాధునిక సాం కేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తున్నారు. పీఎస్ఎల్‌వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటి బిల్డింగ్‌లో 4 దశల రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తరువాత రాకెట్‌ను మొదటి ప్రయోగ వేదిక టవరు అనుసంధానం చేస్తారు.
ఉపగ్రహం వివరాలు..
ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రూపొందించింది. స్పాడెక్స్‌లో 2 ఐఎంఎస్ క్లాస్-2 క్లాస్ ఉపగ్రహాలుంటాయి. ఒకదానికి ఛేజర్, రెండోదానికి టార్గెట్ అని పేర్లు పెట్టారు. ఈ రెండు ఉప గ్రహాల బరువు 400 కేజీల వరకు ఉంటుంది. ఈ రెండు ఉపగ్రహాలను కాస్త భిన్నమైన కొత్త రకం కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Published date : 18 Dec 2024 10:25AM