Skip to main content

Katuri Trivikram: కథా రచయిత కాటూరి త్రివిక్రమ్‌ కన్నుమూత

విజయవాడ నగరానికి చెందిన విఖ్యాత రచయిత, కాలమిస్ట్‌ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్‌ (79) డిసెంబ‌ర్ 18వ తేదీ కృష్ణలంకలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.
Katuri Trivikram passed away

ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. 

రవీంద్ర త్రివిక్రమ్ జీవిత ప్రస్థానం
త్రివిక్రమ్ 1944 డిసెంబర్ 18న విజయవాడలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యను విజయవాడలోనే పూర్తి చేశారు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను పొందారు.

1963లో ఆయన భారత వైమానిక దళంలో చేరి, 1965, 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధాలలో పాల్గొన్నారు. 16 ఏళ్ల పాటు వైమానిక దళంలో సేవలందించిన తరువాత, 20 ఏళ్ల పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేశారు. ఆ తరువాత ఏపీ హైకోర్టు న్యాయవాదిగా తన సేవలను అందించారు. అలాగే.. బార్ అసోసియేషన్ యొక్క జీవితకాల సభ్యుడిగా కూడా ఉన్నారు.

Tulsi Gowda: వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత

రచనా ప్రస్థానం
త్రివిక్రమ్ రచనా ప్రస్థానం 11 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభమైంది. 1974 నవంబర్ 10వ తేదీ ఆయన తొలికథ ప్రచురితమైంది. ఆయన నవల, కథ, నాటకం, పద్యం, గద్యం వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషి చేశారు. మొత్తం 600కు పైగా కథానికలు. 400కుపైగా ఆధ్యాత్మిక వ్యాసాలు రచించి, తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. 

1974లో ప్రారంభమైన ఆయన రచనా ప్రస్తానం 2024 వరకూ సాగుతూనే ఉంది. ఆకాశవాణి కేంద్రంలో ఆయన రచించిన కథలు, నాటికలు ప్రసారం అయ్యాయి. అనేక సాహిత్య పత్రికల్లో కాలమిస్ట్‌గా పని చేశారు.

Zakir Hussain Passed Away: తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

Published date : 19 Dec 2024 06:07PM

Photo Stories