Skip to main content

Self-Made Entrepreneurs: స్వయంకృషితో ఎదిగిన టాప్‌ 10 కంపెనీలు ఇవే..

2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్, హరూన్‌ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి.
D-Mart, Zomato and Swiggy founders top list of Self-Made Entrepreneurs

ఈ నివేదికలో 200 కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు తమ స్వయం కృషితో వృద్ధి సాధించారు. 

ఈ జాబితాలో.. ఈ ఏడాది 'డీమార్ట్' వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ఆయన స్థాపించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) కంపెనీ విలువ రూ.3.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోల్చితే 44 శాతం పెరిగింది. డీమార్ట్ రిటైల్ చైన్ మంచి ఆదరణ పొందుతుండటం గమనార్హం.

Self-Made Entrepreneurs

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న జొమాటో కంపెనీ విలువ రూ.2,51,900 కోట్లకు చేరింది. ఇది ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి సాధించింది.

Radhakishan Damani

శ్రీహర్ష మాజేటి, నందన్‌ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీ మూడో స్థానాన్ని పొందింది. ఆ సంస్థ విలువ రూ.1,01,300 కోట్లగా ఉంది. ఇది 52 శాతం పెరిగింది.

Richest Families: ప్రపంచ సంపన్న కుటుంబాల జాబితా విడుదల.. టాప్-10లో అంబానీ ఫ్యామిలీ

గత ఏడాది హరూన్‌ జాబితాలో డీమార్ట్ అగ్రస్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తదితర కంపెనీలు ఉన్నారు. కానీ ఈసారి ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, క్రెడ్ వంటి కంపెనీలు టాప్–10 నుంచి తప్పిపోయాయి.

ముఖ్యంగా ఫాల్గుణి నాయర్, స్వయం కృషితో ఎదిగిన మహిళా పారిశ్రామికవేత్తగా పదో స్థానం దక్కించుకున్నారు.

అలాగే.. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200 కంపెనీలలో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉన్నాయి, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ కేంద్రంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Best Food Cities: ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార నగరాలు ఇవే.. టాప్‌-5లో ముంబై

Published date : 19 Dec 2024 08:00PM

Photo Stories