Rabi Crops: రబీలో గణనీయంగా పెరిగిన పంటల సాగు
Sakshi Education
భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్‌లో పంటల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది.
పంటల సాగు గత ఏడాది 4.11 కోట్ల హెక్టార్ట మేర ఉంటే అది ఈ ఏడాది డిసెంబర్ తొలి వారానికి 4.28 కోట్ల హెక్టార్లను దాటిందని పేర్కొంది.
వరి పంటల సాగు గత ఏడాది 91.6 లక్షల హెక్టార్ల నుంచి 97.5 లక్షల హెక్టార్లకు పెరగ్గా, గోధుమల సాగు 1.87 కోట్ల హెక్టార్ల నుంచి 2 కోట్ల హెక్టార్లకు, పప్పుధాన్యాలు 1.05 కోట్ల హెక్టార్ల నుంచి 1.08 కోట్ల హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది.
Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..
Published date : 10 Dec 2024 09:36AM