Skip to main content

Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..

ఆంధ్రప్రదేశ్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి, ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలోనూ దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది.
AP number one in egg Production in 2022–23 financial year

అలాగే ఏపీ మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచింది.

ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2023–24 సామాజిక, ఆర్థిక సర్వే ఈ వివరాలను వెల్లడించింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు లభించిందని సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది.  
 
పెరిగిన ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం 

  • రాష్ట్రంలో 5.68 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉంది.
  • 19.81 టన్నుల హెక్టార్ పైన ఉత్పత్తి సాధించబడింది.
  • 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి జరిగింది, 3.31 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి కూడా రికార్డు అయ్యింది.
  • గత మూడేళ్లలో 18 జిల్లాల్లో 124 మండలాల్లో 42,098 రైతులు 1,13,670 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను ప్రారంభించారు.

Micro Irrigation: సూక్ష్మ సేద్యంలో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ

పశు సంపద రంగంలో పురోగతి 

  • రాష్ట్రం అత్యంత సంపన్నమైన పశు సంపదను కలిగి ఉంది, దీని వల్ల పశుసంపద రంగం ముఖ్యమైన ప్రాధాన్యతను పొందింది.
  • రైతు భరోసా కేంద్రాలు ద్వారా 6,542 పశు సహాయకులు నియమింపబడి, పశువుల యజమానులకు సేవలు అందించారు.
  • పశు వైద్యుల సహాయం తో పశు సంరక్షణ, ప్రథమ చికిత్స వంటి సేవలు అందించబడుతున్నాయి.
  • 75% సబ్సిడీతో సర్టిఫైడ్ పశుగ్రాసం విత్తనాలు, 60% సబ్సిడీతో చాఫ్ కట్టర్ల పంపిణీ కూడా జరిగింది.


అలాగే.. 2,02,052 మందికి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. 

మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్

  • రైతుల ఇంటి వద్దే వెటర్నరీ సేవలను అందించేందుకు గత ప్రభుత్వం రెండు దశల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున మొబైల్‌ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని సర్వే తెలిపింది.

Panchayati Raj Institution: పంచాయతీరాజ్‌ సంస్థల రాబడుల్లో ఏపీ భారీ వృద్ధి.. గత ఐదేళ్లలో..

Published date : 26 Nov 2024 04:06PM

Photo Stories