Gross Product: కోవిడ్ వెంటాడినా ఏపీ వృద్ధి ముందుకే.. ఆర్‌బీఐ నివేదిక వెల్లడి
ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్ధికరంగ నిపుణులు పేర్కొంటారు.
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను విడుదల చేసింది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్‌డీపీ 31.04 శాతం వృద్ధి నమో దైనట్టు ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46 శాతం నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 3.29 శాతం నమోదైంది.
సంక్షోభంలోనూ..
కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని రెండేళ్లు వెంటాడింది. ఆ పరిస్థితుల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తయారీ రంగం ఐదేళ్లలో 58.39 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 11.67 శాతం నమోదైంది.
పారిశ్రామిక రంగంలో 46.62 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 9.32 శాతంగా నమోదైంది. నిర్మాణ రంగంలో గత ఐదేళ్లలో 41.50 శాతం వృద్ధి నమోదవ్వగా.. సగటు వార్షిక వృద్ధి 8.3 శాతంగా ఉంది. ఐదేళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో 42.04 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 8.40 శాతంగా ఉంది. సేవా రంగం 22.90 శాతం వృద్ధి నమోదు చేయగా.. సగటు వార్షిక వృద్ధి 4.5 శాతంగా నమోదైంది.
GSDP: ఏపీలో.. అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి.. ఆర్‌బీఐ నివేదికలో వెల్లడి