SepakTakraw World Cup: సెపక్‌తక్రా ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకం
Sakshi Education
సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.

బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో పురుషుల రెగూ ఈవెంట్‌లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.
సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకంకాగా.. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్‌పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా.. ఈ వరల్డ్‌కప్‌లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది.
మహిళల డబుల్స్ విభాగంలో రజతం.. పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్‌డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది.
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన న్యూజిలాండ్
Published date : 28 Mar 2025 09:14AM