Pritish Nandy: ప్రముఖ జర్నలిస్టు ప్రీతిష్ నంది కన్నుమూత
Sakshi Education
ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ పాత్రికేయుడు, కవి, చిత్రకారుడు, సినీ నిర్మాత ప్రీతిష్ నంది(73) కన్నుమూశారు.
జనవరి 8వ తేదీ ఆయన దక్షిణ ముంబైలోని తన ఇంటిలో గుండె పోటుతో చనిపోయారు.
బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జన్మించిన ఆయన పాత్రికేయ వృత్తితోపాటు టీవీ మాధ్యమంలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రీతిష్ నంది శివసేన నుంచి రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు.
ప్రీతిష్ నంది కమ్యూనికేషన్ బ్యానర్ కింద సుర్, కాంటే, ఝం.కార్ బీట్స్, చమేలీ, హజారో క్వాయిషే ఐసే, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ చిత్రాలను నిర్మించారు. ఆంగ్లంలో 40 పుస్తకాలు రాశారు. బెంగాలీ, ఉర్దూ, పంజాబీల నుంచి కవిత్వాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించారు. సాహిత్య రంగంలో చేసిన సేవలకుగానూ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
Published date : 10 Jan 2025 03:41PM