Pravasi Bharatiya Divas: ‘ప్రవాసీ భారతీయ దివస్’లో ప్రధాని మోదీ
ఈ వేడుకలలో మోదీ చేసిన ప్రసంగం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉన్నది. ఆయన భారతదేశం గ్లోబల్ వేదికపై పెరిగిన ప్రతిష్టను, ప్రజాస్వామ్యాన్ని ప్రస్తావించారు. గతంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచిన విధానం ద్వారా భారత్ దార్శనికతను చాటిచెప్పారు.
ప్రధాని మాట్లాడుతూ.. "భవిష్యత్తు యుద్ధంలో కాదు, బుద్ధుడి బోధనలో ఉంది" అని చెప్పారు. అలాగే, ప్రవాస భారతీయులు మన దేశ ప్రతిష్టను పెంచి, విదేశాలలో మన గర్వాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.
భవిష్యత్ భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని కోరిన మోదీ, యువత మరియు నైపుణ్యంపై భారతదేశం ఉన్న శక్తిని ప్రస్తావించారు.
PM Modi in AP: ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..
ముఖ్య అతిథిగా హాజరైన క్రిస్టినా క్లారా
ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టినా క్లారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్ ప్రపంచ నాగరికత అభివృద్ధిలో పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆమె భారతదేశం అందించిన ఆయుర్వేదం, గణితం, వైద్యం, సముద్రయాన రంగాలలో చేసిన విప్లవాత్మక కృషిని గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఆయుర్వేదం గురించి పేర్కొన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది.