Sheikh Hasina: భారత్‌లో.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా వీసా గడువు పెంపు
Sakshi Education
విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.
ఆమె పాస్ట్‌పోర్ట్‌ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ జనవరి 7వ తేదీ ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించింది. ఆమెతోపాటు 75 మంది పాస్ట్‌పోర్ట్‌లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా
Published date : 09 Jan 2025 12:36PM