Skip to main content

Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో(53) ప్రధాని పదవికి, అధికార లిబరల్‌ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసినట్లు జ‌న‌వ‌రి 6వ తేదీ ప్రకటించారు.
Justin Trudeau Announces Resignation As Canadas PM  Justin Trudeau announcing his resignation

కొత్త పార్టీ నాయకుడు ఎన్నికయ్యే వరకు ఆయన ప్రధానిగా కొనసాగుతారు. ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా చేయడం, అలాగే లిబరల్‌ పార్టీ ఒత్తిడి పెరగడం, తొమ్మిది సంవత్సరాల పాలన అనంతరం నాయకత్వ మార్పు అవసరం అనే వాదనలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ట్రూడో మాట్లాడుతూ.. ‘పార్టీ నేత, ప్రధాని పదవులకు రాజీనామా చేయాలని భావిస్తున్నాను. దేశవ్యాప్త ఎన్నికల ద్వారా కొత్త నాయకుడు ఎన్నికయ్యే వరకు నేను ప్రధానిగా కొనసాగుతాను’ అని తెలిపారు.

ఈ ప్రకటనలో.. ట్రూడో తన నాయకత్వంలో ఉన్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని కూడా అంగీకరించారు. ‘రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నేతను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, నా నాయకత్వంలో నిస్సారంగా ఉన్న ఈ పరిస్థితిలో నేను ఉత్తమ ఎంపిక కాలేనని నాకు స్పష్టమైంది’ అని తెలిపారు.

PM Shinawatra: తన ఆస్తుల వివరాలు ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?

ప్రధాన మంత్రిగా తన బాధ్యతలు కొనసాగిస్తూ, ట్రూడో పార్లమెంట్‌ సమావేశాలను 27 జనవరి నుంచి 24 మార్చి వరకు వాయిదా వేశారు. ఈ నిర్ణయం, 2025 అక్టోబరులో జరగాల్సిన ఎన్నికల్లో, అధికార లిబరల్‌ పార్టీని కన్జర్వేటివ్‌ పార్టీతో పోలిస్తే ప్రజాదరణలో వెనుకబడి ఉండడం, మూడు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రకటించడం వంటి పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నట్లు అంచనా వేయబడుతోంది.

2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో, గతంలో తన తండ్రి పియెర్రె ట్రూడో కూడా ప్రధానిగా పని చేసి, మంచి పేరు సంపాదించారు. మొదటి రెండు సంవత్సరాలు ఆయన పాలన మంచి గుర్తింపు పొందినప్పటికీ, ఆహారం ధరలు, వలసల పెరుగుదల వంటి అంశాల వల్ల ఆదరణ కోల్పోయారు. ట్రంప్‌ హెచ్చరికలు, ఆర్థిక మంత్రి, హౌసింగ్‌ మంత్రుల రాజీనామాలు కూడా ఈ నిర్ణయానికి కీలకమైన కారణాలు అవుతున్నట్లు తెలుస్తోంది. 

Francois Bayrou: ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్‌ బైరూ

Published date : 07 Jan 2025 03:03PM

Photo Stories