AP Government: ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమితులైన నలుగురు వీరే..

కేబినెట్ ర్యాంకు వంతుగా రెండు సంవత్సరాల పాటు వీరు పదవిలో కొనసాగనున్నారు.
1. సుచిత్ర ఎల్లా: భారత బయోటెక్ ఎండీ, చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ఆమె ప్రభుత్వానికి ఈ రంగంలో సలహాలు, సూచనలు అందించనున్నారు.
2. జి.సతీష్ రెడ్డి: డీఆర్‌డీఓ(DRDO) మాజీ చీఫ్, ఆయన్ని ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుగా నియమించారు. పరిశ్రమలు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ(AI), రోబోటిక్స్ తదితర రంగాలలో ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు.
3. కేపీసీ గాంధీ: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి ఫోరెన్సిక్ సైన్స్ సంబంధిత అంశాలపై సలహాలు అందించనున్నారు.
4. శ్రీధర పనిక్కర్ సోమనాథ్: స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ, పరిశోధన, పాలనా వ్యవహారాలలో ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు.