Andhra Pradesh: ఏపీలో రూ.2 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు.. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే..
విశాఖపట్నంలోని ఏయూలో జనవరి 8వ తేదీ జరిగిన ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు ఇవే..
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో విశాఖ ప్రపంచంలోనే కీలక ప్రాంతంగా మారనుందని ప్రధాని అన్నారు. ఈ పథకంలో భాగంగా 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖలో ఏర్పాటు కానుంది.
బల్క్ డ్రగ్ పార్కు: దేశంలో ఏర్పడే మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. ఇది ఉత్పత్తి, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధికి అనువుగా మారి, దేశీయ ఫార్మా రంగానికి పెద్ద ఎత్తున సహకరిస్తుంది.
రైల్వే జోన్: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో, రైతులు, వ్యాపారాలు, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు 4,14,40,447
అంతర్జాతీయ పెట్టుబడులు: 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు. ఏపీలో క్రిస్ సిటీ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పెరుగుతున్నాయని చెప్పారు.
భవిష్యత్తు లక్ష్యాలు: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, కొత్త టెక్నాలజీలు, పరిశ్రమలు ప్రోత్సహించబడతాయని తెలిపారు.
స్మార్ట్ సిటీ & పట్టణీకరణ: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నంలో తమవంతు కృషి చేస్తామని చెప్పారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు..
- పూడిమడకలో రూ.1,85,000 కోట్లతో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్
- రూ.149 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం
- రూ.1,876 కోట్లతో నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్క్
- రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో క్రిస్ సిటీ నిర్మాణం
- 465 కి.మీ. పొడవైన రైల్వే లైన్స్ డబ్లింగ్ పనులకు సంబంధించి 3 ప్రాజెక్టులు
- 48 కిలోమీటర్లకు సంబంధించి 3 ప్రాజెక్టుల రైల్వే లైన్ల నిర్మాణం
- డబుల్ లైన్, 4 లైన్ల నిర్మాణానికి సంబంధించి 294 కి.మీ. మేర 7 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ ప్రాజెక్టులు
- 28 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ బైపాస్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు
Gross Product: గడచిన ఐదేళ్లలో.. ఏపీ వృద్ధి ముందుకే..
➯ ప్రధాని చేతుల మీదుగా రూ.2,08,545 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
➯ స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర భారత్, పటిష్ట భారత్ కోసం మోదీ ఎంతో కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ని తీర్చిదిద్దిన ఘనత మోదీదే అని చెప్పారు. భారీ పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో ఏకంగా 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)