Skip to main content

WEF in Davos: రికార్డు సృష్టించిన తెలంగాణ.. రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాలు

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు సాధించింది.
Telangana attracts Rs 1.78 lakh crore investments at WEF in Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ బృందం రూ.1,78,950 కోట్లు పెట్టుబడులను సాధించి, 49,500 ఉద్యోగాల కల్పన కోసం కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. జ‌న‌వ‌రి 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో పాల్గొంది. 

ఈ సమావేశంలో.. అమెజాన్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, మేఘా ఇంజనీరింగ్ వంటి కంపెనీలతో భారీ పెట్టుబడులు, విస్తరణ ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణకు గొప్ప విజయంగా నిలిచింది. ముఖ్యంగా ఐటీ రంగం, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ సెల్స్, రక్షణ రంగం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు రావడం తెలంగాణకు భారీ ఆర్థిక లాభాలను అందించనున్నాయి. సమావేశాలు విజయవంతం కావడంతో రాష్ట్రం మరింత ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. 

Telangana: తెలంగాణ ప్రభుత్వంతో.. మేఘా ఇంజనీరింగ్‌ మూడు కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై, కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగాలు, వాణిజ్య అవకాశాలు రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడతాయని ఆయన తెలిపారు. కోవిడ్‌ తర్వాత చైనా ఆధారిత సరఫరా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రం అవకాశాలను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది రాష్ట్రం అభివృద్ధికి చాలా అవసరమైన అవకాశం. తెలంగాణలోని అన్ని రంగాలు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, సొలార్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ప్రభుత్వ రంగాలలో పెట్టుబడులు పెరిగితే, ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తుంది.

Coal Mining: నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి.. 1,600 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం

Published date : 25 Jan 2025 09:38AM

Photo Stories