Skip to main content

CBI Assistant Programmer jobs: డిగ్రీ, BTech అర్హతతో CBI లో ఉద్యోగాలు నెలకు జీతం 60వేలు

CBI jobs  UPSC Assistant Programmer Recruitment Notification Central Bureau of Investigation Assistant Programmer Vacancies UPSC CBI Assistant Programmer 27 Posts Recruitment  UPSC Notification for Assistant Programmer in CBI  CBI Assistant Programmer Pay Scale and Vacancy Details
CBI jobs

మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్స్స్ & పెన్షన్స్ పరిధిలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ పరిధిలో  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ నందు గల అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాల భర్తీ కొరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 27 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. ఎందుకంటే: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : మొత్తం 27 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

భర్తీ చేయబోయే ఉద్యోగాలు : అసిస్టెంట్ ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్  / కంప్యూటర్ సైన్స్  / మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ  లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైసెన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
                      (లేదా)

గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్ లో  2 సంవత్సరాల అనుభవం అవసరం
                      (లేదా)

డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆక్రిరిటెడ్ కంప్యూటర్ కోర్సు లో డిప్లొమా లేదా కంప్యూటర్ అప్లికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేస్ వుండాలి.
ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్ వర్క్ లో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

గరిష్ఠ వయస్సు : 

30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు

దరఖాస్తు విధానం : అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు : అభ్యర్థులు 25 /- రూపాయల అప్లికేషన్ ఫీజును ఏదైనా SBI బ్రాంచ్ వద్ద లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.
ఎస్సీ , ఎస్టీ , PwBD , మహిళలు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

పే స్కేల్: 7వ CPC ప్రకారం 7వ లెవెల్ 60000పే స్కేల్ వర్తిస్తుంది.

ఎంపిక విధానం: అభ్యర్థుల యొక్క దరఖాస్తులు ఆధారంగా ఇంటర్వ్యూ లేదా  వ్రాత పరిక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 09/11/2024
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 28/11/2024
ఫైనల్ సబ్మిషన్ కొరకు చివరి తేది : 29/11/2024

Published date : 12 Nov 2024 09:28AM
PDF

Photo Stories