Skip to main content

Andhra Pradesh Uranium Corporation jobs: 10వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ యురేనియం కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Uranium Corporation of India Limited jobs  Uranium Corporation of India Limited Apprentice Fitter Vacancy
Uranium Corporation of India Limited jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కడప జిల్లాలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), టర్నర్ / మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నారు. 


భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 పోస్టులు వివిధ ట్రేడ్లలో భర్తీ చేయడం జరుగుతుంది.

భర్తీ చేస్తున్న పోస్టులు: 
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) , టర్నర్ / మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్స్ లో అప్రెంటీస్ ఖాళీలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యార్హతలు: పదో తరగతి మరియు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ పూర్తి చేసిన వారు ఈ అప్రెంటిస్ శిక్షణకు అర్హులు.

అప్లికేషన్ ఫీజు : ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

అప్లికేషన్ చివరి తేదీ : 12-02-2025 తేది లోపు అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

వయస్సు : కనీసం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. (13-01-2025 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు) 

వయస్సు సడలింపు : 
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది.

స్టైఫండ్: ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులను ఐటిఐ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

 

Apply Online: Click Here

Published date : 04 Feb 2025 10:15AM
PDF

Photo Stories