Dr Gayathri: స్విమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఫెలోషిప్ అవార్డు
Sakshi Education
తిరుపతి తుడా: స్విమ్స్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రిని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ (ఎఫ్‌ఏసీఈ) ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్ అకాడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది.
ఈ మేరకు ఆమెకు ఫెలోషిప్ అవార్డు వచ్చినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ మే 23న మీడియాకు తెలిపారు.
చదవండి: Admission in SVIMS Tirupati: తిరుపతి స్విమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
మే 11వ తేదీన అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఓర్లిన్స్‌లో నిర్వహించిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజిస్ట్స్ వార్షికోత్సవ సదస్సులో గాయత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆమె ప్రతిభను గుర్తించిన సంబంధిత అసోసియేషన్ ఈ ఫెలోషిప్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రిని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ అభినందించారు.
Published date : 23 May 2024 05:43PM