Skip to main content

Job Mela For Freshers: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా

job mela  Job fair at Mogalrajapuram, Vijayawada East, for unemployed youth  Job fair in Krishna district at Government Polytechnic College for private sector jobs
job mela

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు ఈ నెల 21వ తేదీన స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా జరుగుతుందని ఎన్టీఆర్‌ జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 

10వ తరగతి అర్హతతో LIC లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 7000: Click Here

టెక్నోటాస్క్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, దొడ్ల డెయిరీ లిమిటెడ్‌, కోస్టల్‌ న్యూమటిక్‌ ఏజెన్సీస్‌, రమా క్లాత్‌ స్టోర్స్‌ మొదలైన కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు జాబ్‌ మేళాలో పాల్గొ నేందుకు అర్హులని తెలిపారు.

ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ ఉదయం తొమ్మిది గంటల విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో జరిగే జాబ్‌మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93912 54464, 93477 79032 సెల్‌ నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్‌బాబు పేర్కొన్నారు.

ముఖ్యసమాచారం:
విద్యార్హత: టెన్త్‌/ ఇంటర్‌/ డిగ్రీ/ పీజీ
వయస్సు:18-30 ఏళ్లకు మించకూడదు

ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 21న
లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

 

Published date : 23 Dec 2024 09:57AM

Photo Stories