Skip to main content

BSF jobs: 10వ తరగతి అర్హతతో BSF లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు జీతం నెలకు 69000

BSF jobs
BSF jobs

BSF కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2024: జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న లేదా విజయాలు సాధించిన క్రీడాకారులకు బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, క్రీడల ప్రావీణ్యాన్ని ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

10వ తరగతి అర్హతతో LIC లో Work From Home ఉద్యోగాలు: Click Here

భర్తీ చేసే పోస్టులు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)

ఖాళీలు: 275

కేటగిరీ: నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ (స్పోర్ట్స్ కోటా)

క్రీడాంశాలు (27)

ఈ రిక్రూట్మెంట్‌కు అర్హత కలిగిన క్రీడాంశాలు:
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్‌ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్‌, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్.

విద్యార్హత: పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత.

క్రీడా ప్రావీణ్యం: నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం లేదా విజయం సాధించడం.

వయస్సు: 2025 జనవరి 1నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేది: డిసెంబర్ 30, 2024 (రాత్రి 11:59 వరకు).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు రుసుము:
జనరల్, EWS, OBC: ₹147
ఎస్సీ, ఎస్టీ, మహిళలు: ఫీజు మినహాయింపు.

ఎంపిక ప్రక్రియ
అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)
మెరిట్ ఆధారంగా ఎంపిక:
రాత పరీక్ష లేదు.
తుది ఎంపిక తర్వాత నేరుగా ఉద్యోగం కేటాయింపు.

జీతం: 7వ పే స్కేల్ ప్రకారం: ₹21,700 – ₹69,100 నెలకు.

ప్రయోజనాలు
ఈ అవకాశంతో క్రీడాకారులు BSF లో ఉద్యోగం పొందడంతో పాటు తమ క్రీడా ప్రావీణ్యాన్ని కొనసాగించవచ్చు. రాత పరీక్ష లేకుండా ఎంపిక ప్రక్రియ జరగడం ప్రధాన ఆకర్షణ.

Published date : 21 Dec 2024 08:26PM
PDF

Photo Stories