To Lam: వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన టో లామ్
Sakshi Education
వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మే 22వ తేదీ లామ్ ఎన్నికను వియత్నాం పార్లమెంటు ఖరారు చేసింది.
లామ్ పదవీకాలంలో పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.
ఇటీవల కాలంలో వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబయలై రాజకీయ, వ్యాపార వర్గాలను కుదిపేశాయి. దేశాధ్యక్షుడు, స్పీకర్‌తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేకులు పదవులకు రాజీనామా చేశారు.
అధ్యక్ష పదవి అలంకారప్రాయమే అయినా, దేశంలో అత్యంత ముఖ్యమైన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మున్ముందు లామ్ నే వరించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ గుయెన్ ఫూ ట్రాంగ్ 2021లో మూడోసారి ఆ పదవిని చేపట్టారు.
Lai Ching-te: తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లై చింగ్-తే
Published date : 23 May 2024 05:10PM