Skip to main content

Huge Demand for Jobs in Future : రానున్న రోజుల్లో ఏ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువ‌..? ప‌డిపోయే ఉద్యోగాలివే.. కార‌ణం!!

తాజాగా, నిర్వ‌హించ‌న ఒక స‌ర్వే ప్ర‌కారం భ‌విష్య‌త్తులో అంటే, రానున్న ఐదేళ్ల‌లో ప‌లు ఉద్యోగాలు ఉండ‌క‌పోవ‌చ్చు అని తెలుస్తోంది.
Disappearance and huge demand of various jobs in future

సాక్షి ఎడ్యుకేష‌న్: తాజాగా, నిర్వ‌హించ‌న ఒక స‌ర్వే ప్ర‌కారం భ‌విష్య‌త్తులో అంటే, రానున్న ఐదేళ్ల‌లో ప‌లు ఉద్యోగాలు ఉండ‌క‌పోవ‌చ్చు అని తెలుస్తోంది. ఈ మెర‌కు భ‌విష్య‌త్తులో ఉండే ఉద్యోగాలు, కోల్పోయే ఉద్యోగాలు ఏంటో ఒక‌సారి తెలిసుకుందాం..

రానున్న రోజుల్లో అంటే.. మ‌రో ఐదేళ్ల‌లో క్యాషియర్‌, టికెట్ క్లర్క్‌, డేటా ఎంట్రీ క్లర్క్‌ వంటి ఉద్యోగాలు ఉండకపోవచ్చని ఒక‌ సర్వేలో పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ పనులు పెరుగుతాయని, డ్రైవర్ల అవసరం ఎక్కువ అవుతుందని స‌ర్వే వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, జాబ్ మార్కెట్‌లో భారీ మార్పులు రావడానికి కారణం టెక్నాలజీ అడ్వాన్స్ కావడమే. దీనికి తోడు గ్లోబల్‌గా నెలకొన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివిధ ప్రాంతాల్లో మారుతున్న అలవాట్లు వంటివి జాబ్ మార్కెట్‌లో పెద్ద మార్పులు తీసుకొస్తున్నాయి.

Good news for Anganwadi Job Aspirants: అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ!.. టీచర్లు, హెల్పర్లు..

కొత్త ఉద్యోగాలు.. స్కిల్స్‌లో మార్పులు..

వచ్చే ఐదేళ్లలో సుమారు 17 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, 9.2 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) తన తాజా స‌ర్వే రిపోర్ట్‌లో వివరించింది. నికరంగా 7.8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపింది. ప్ర‌స్తుతం, ఉన్న‌ జాబ్స్‌కు అవసరమయ్యే స్కిల్స్‌ను కూడా ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. దీంతో, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. ప్ర‌తీ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్‌ను వారిలో ఏర్ప‌ర్చుకునేందుకు మ‌రో విద్య‌ను పొందడం చాలామందికి ఇది ఇబ్బందిగా మారింది. ఏఐ, బిగ్‌డేటా, సైబర్ సెక్యూరిటీస్ వంటి టెక్నాలజీ స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. కానీ, క్రియేటివ్ థింకింగ్‌, ఫ్లెక్సిబిలిటీ వంటి హ్యూమన్ స్కిల్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి.

వీటికి మాత్రం హ్యూజ్ డిమాండ్‌..

ముందున్న కాలంలో విద్యా రంగంలో మ‌రింత ఎక్కువ ఉద్యోగాలను నిర్వ‌హించే అవకాశం కనిపిస్తోంది. మ‌రి కొన్ని సంవత్స‌రాలు ముందుకు వెలితే టెక్నాల‌జీ కూడా మ‌న‌కన్నా ఎక్కువ ముందుకు వెళ్తుంది. దీంతో, మ‌రిన్ని ఉద్యోగాలు కూడా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. భ‌విష్య‌త్తులో డేటా సైన్స్‌, సైబ‌ర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఏర్పడ‌తాయని కొన్ని వ‌ర్గాలు చెబుతున్నాయి. యూనివర్సిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్లు, సెకండరీ స్కూల్ టీచర్లు, కౌన్సెలింగ్ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలు కూడా భవిష్య‌త్తులో భారీగా పెరగనున్నాయి.

Jobs In HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఏఐకి మొగ్గు..

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తోంది. బిగ్‌ డేటా, రోబోటిక్స్‌, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల్లో స్పెషలిస్ట్‌లకు భారీగా డిమాండ్ ఉంది.

చాలా కంపెనీలు ఈ టెక్నాలజీలను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆటోమేషన్‌ కారణంగా తమ ఉద్యోగులను తగ్గించుకుంటామని 41శాతం కంపెనీలు ప్రకటించాయి. ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని 77 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.

ఈ జాబ్స్‌ ప‌డిపోయే అవ‌కాశాలు ఎక్కువే..

ఈ స‌మ‌యంలోనే ఎగ్జామినర్లు, ఇన్వెస్టిగేటర్లకు డిమాండ్ ప‌డిపోయే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇంకో ఐదేళ్లలో వ్యవసాయం పనులు చేసేవారు, డెలివరీ డ్రైవర్లు, కన్‌స్ట్రక్షన్ వర్కర్లు, సాఫ్ట్‌వేర్, యాప్ డెవలపర్లు, సేల్స్ పర్సన్స్‌ అవసరం భారీగా ఉంటుందని, ఈ జాబ్స్ ఎక్కువగా పెరుగుతాయని డబ్ల్యూఈఎఫ్‌ రిపోర్ట్ వివరించింది. అలానే నర్సింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో పనిచేసేవారు, కారు, వ్యాన్‌, మోటార్ సైకిల్ డ్రైవర్లు, ఫుడ్‌, డ్రింకులను సర్వ్‌ చేసేవాళ్లు, జనరల్‌, ఆపరేషనల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నాయి.

Govt Job Notifications : యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే జాబ్ నోటిఫికేష‌న్స్.. గ్రూప్స్ ఫ‌లితాల‌పై క్లారిటీ..!!

మరోవైపు క్యాషియర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, టికెట్ క్లర్క్‌, ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ, బిల్డింగ్ క్లీనర్లు, హౌస్‌ కీపర్లు, మెటీరియల్స్, స్టాక్ రికార్డ్‌లను చూసుకునే క్లర్క్‌లు, ప్రింటింగ్‌, సంబంధిత జాబ్‌ల డిమాండ్ మాత్రం వేగంగా పడిపోనుంది.

అకౌంటింగ్‌, బుక్‌కీపింగ్‌, పేరోల్ క్లర్క్స్‌, అకౌంటెంట్స్‌, ఆడిటర్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్ అటెండెంట్లు, బ్యాంక్ క్లర్క్‌లు, డేటా ఎంట్రీ క్లర్క్‌లు, కస్టమర్ సర్వీస్‌ వర్కర్లు, సెక్యూరిటీ గార్డ్స్‌, కండక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్లు వంటి జాబ్స్ భారీగా పడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 03:29PM

Photo Stories