Skip to main content

AP Polycet 2025 : ఏపీ పాలిసెట్ 2025కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ప్రిప‌రేష‌న్‌కు మెటీరియ‌ల్స్ అందుబాటులో..

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల పొందేందుకు నిర్వహించే ఏపీ పాలిసెట్ ప‌రీక్షకు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌లైంది.
AP POLYCET exam 2025 applications and preparation details in telugu   Important notice for AP Polycet applicants  AP Polycet 2024 notification released

సాక్షి ఎడ్యుకేష‌న్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల పొందేందుకు నిర్వహించే ఏపీ పాలిసెట్ ప‌రీక్షకు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇక‌, ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలై అనేక మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. అర్హ‌త‌, ఆసక్తి కలిగిన విద్యార్థులు వెంట‌నే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి, త‌గిన వివ‌రాలతో ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవాల‌ని సూచించారు అధికారులు.

Errors in Inter Question Paper : మూడు స‌బ్జెక్టుల్లో ఆరు త‌ప్పులు.. ఇంట‌ర్ విద్యార్థుల ఆందోళ‌న‌..

ఈ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ను వ‌చ్చేనెల‌, ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన‌సాగుతుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తుల రుసుముగా, ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.100 చెల్లించాలి.

విద్యార్థుల‌కు అందుబాటులో మెటీరియ‌ల్‌..

ఏపీ పాలిసెట్ 2025 ప‌రీక్ష‌కు పదో తరగతి విద్యార్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తుల్లో, విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలు, మెటీరియల్‌ (తెలుగు-ఆంగ్ల మీడియం)ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏపీ పాలిసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిప‌రేష‌న్‌లో భాగంగా విద్యార్థులు ఈ మెటీయ‌ల్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శిస్తే విద్యార్థులు ప్ర‌తీ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

SSC MTS final result 2024 Declared News In Telugu: SSC MTS తుది ఫలితాలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

విధానం.. మార్కులు..

ద‌ర‌ఖాస్తులు చేసుకున్న విద్యార్థుల‌కు ఏప్రిల్ 30వ తేదీన ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం 120 ప్రశ్నలు ఉండ‌గా, రెండు గంట‌ల స‌మ‌యాన్ని కేటాయిస్తారు. ఇక‌, స‌బ్జెక్టుల విష‌యానికొస్తే.. ప‌రీక్ష‌లో మ్యాథ‌మెటిక్స్‌-50, ఫిజిక్స్‌-40, కెమిస్ట్రీ-30 ప్ర‌శ్న‌లు ఉంటాయి.

Engineering Fees : రానున్న రోజుల్లో భారీగా పెర‌గ‌నున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఏకంగా 2 ల‌క్ష‌లు..

ఇచ్చిన గ‌డువులో విద్యార్థులు త‌మ ప‌రీక్ష‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ప‌రీక్ష‌లో ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున ఎన్ని ప్ర‌శ్న‌లు ఉంటే అన్ని మార్కుల‌న్న‌మ‌ట. ఇక‌, ఇందులో నెగెటివ్‌ మార్కులు లేక‌పోవ‌డం విద్యార్థుల‌కు పెద్ద శుభ‌వార్త అనే చెప్పాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Mar 2025 01:17PM

Photo Stories