Polycet 2024 Counselling: ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్
పాలిసెట్ కౌన్సెలింగ్ గురువారంతో ముగిసింది. వాస్తవానికి ఈ నెల 3వ తేదీతో కౌన్సెలింగ్ పూర్తి కావాల్సి ఉండగా 4వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 6వ తేదీకి వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా కౌన్సెలింగ్ పూర్తయ్యేనాటికి కంచరపాలెం గైస్, పాలిటెక్నిక్, పెందుర్తి పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మొత్తం 3,968 మంది తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నారు. గైస్‌లో 1,568 మంది, కంచరపాలెం పాలిటెక్నిక్‌లో 1814, పెందుర్తి పాలిటెక్నిక్‌లో 586 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గురువారం నిర్వహించిన కౌన్సె లింగ్‌కు గైస్‌లో 225 మంది, కంచరపాలెం పాలిటెక్నిక్‌లో 263 మంది, పెందుర్తి పాలిటెక్నిక్‌లో 68 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు.
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న విద్యార్థులు శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీలోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పాలిసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె.నారాయణరావు, గైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ, పెందుర్తి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ పాలిటెక్నిక్‌లలో చేరడానికి వీలుగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని, మధ్యవర్తులను నమ్మవద్దని వారు విద్యార్థులకు సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కేంద్రాలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు ఇతరులకు ఇవ్వవద్దని హెచ్చరించారు.
Also Read: Josaa Counselling Important Dates 2024
ఇవీ కాలేజీలు
ఉమ్మడి జిల్లాలో 8 ప్రభుత్వ, 19 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాల, గైస్, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల , భీమిలి మహిళా పాలిటెక్నిక్, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు రెసిడెన్షియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్, కెమికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (గైస్), అనకాపల్లి పాలిటెక్నిక్, నర్సీపట్నం, భీమిలి మహిళా కాలేజీలకు ఇప్పటికే ఎన్‌బీఏ గుర్తింపు వచ్చింది. మిగతా ప్రభుత్వ కాలేజీలకు కూడా ఎన్‌బీఏ గుర్తింపు త్వరలోనే రానుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆచితూచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లతోపాటు, ఇతర ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో కోర్సులను సరి చూసుకుని ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.