Skip to main content

Polycet 2024 :రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీ నేడు

Polytechnic seat replacement in Rajiv Gandhi Polytechnic College today

కశింకోట: కశింకోటలోని పూర్వ ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో 50 శాతం కోటా సీట్ల భర్తీకి బుధవారం ఉదయం 9.30 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ కె.శివ మంగళవారం విలేకరులకు తెలిపారు. కళాశాలలో 4 బ్రాంచ్‌లున్నాయన్నారు. మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచుల్లో ఒక్కొక్కదానిలో 30 వంతున సీట్లు ఉన్నాయన్నారు. వీటి కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు జతల జెరాక్స్‌ కాపీలతో కౌన్సెలింగ్‌కు నిర్దేశించిన సమయానికి హాజరు కావాలన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెడ్‌ను ఈ కౌన్సెలింగ్‌కు పర్యవేక్షణ అధికారిగా నియమించారన్నారు. వివరాలకు 906397220, 9505504220, 08924–22037 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

Also Read: ఇంటర్‌ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం

Published date : 10 Jul 2024 03:56PM

Photo Stories