Skip to main content

Sports Management Courses : స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పూర్తి చేసుకుంటే ఉజ్వల అవకాశాలు

క్రీడా రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి వినూత్న వేదికగా నిలుస్తోంది.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌!!
Sports management courses for huge employment offers

గత కొంతకాలంగా దేశ క్రీడా రంగం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న క్రీడల పోటీలు..  వాటి నిర్వహణకు నిపుణులైన మానవ వనరుల అవసరం పెరుగుతోంది! దీంతో.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ యువతకు ఉపాధి వేదికగా మారుతోంది. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పూర్తి చేసుకుంటే ఉజ్వల అవకాశాలు అందుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకత, అకడెమిక్‌ కోర్సులు, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం.. 

CIPET Teaching Posts : సీఐపీఈటీలో 7 టీచింగ్‌ పోస్టులు.. అర్హ‌త‌లు ఇవే

క్రీడా రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి వినూత్న వేదికగా నిలుస్తోంది.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌!! గత కొంతకాలంగా దేశ క్రీడా రంగం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న క్రీడల పోటీలు..  వాటి నిర్వహణకు నిపుణులైన మానవ వనరుల అవసరం పెరుగుతోంది! దీంతో.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ యువతకు ఉపాధి వేదికగా మారుతోంది. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పూర్తి చేసుకుంటే ఉజ్వల అవకాశాలు అందుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకత, అకడెమిక్‌ కోర్సులు, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం.. 

India China Ties: భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ మంత్రుల భేటీ

ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్‌ కప్, ఐపీఎల్, వివిధ క్రికెట్, ఛెస్‌ వంటి టోర్నీలను మైదానంలో వీక్షించే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా నిరంతరం ఏదో ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని నిర్వహించడం కత్తిమీద సామే! ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. నిర్దిష్టంగా ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు సంబంధించి మార్కెటింగ్‌ నుంచి గ్రాండ్‌ ఫైనల్‌ వరకూ.. ప్రతి దశలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీడాకారులు మొదలు మైదానంలో ఆటను వీక్షించే లక్షల మంది అభిమానుల దాకా.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నిర్వహించాలంటే ప్రత్యేక నిర్వహణ నైపుణ్యాలు ఉండాలి. అందుకే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణుల కోసం పలు క్రీడల నియంత్రణ సంస్థలు(బీసీసీఐ, ఐసీసీ, బీఏఐ, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తదితర) అన్వేషిస్తున్నాయి. 

కోర్సులు ఇవే 

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌ కోరుకునే వారికి అకడమిక్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. బీబీఏలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ను మేజర్‌ కోర్సుగా పలు యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అదే విధంగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఎంబీఏ– స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌ మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పలు ప్రోగ్రామ్‌లను ఎన్నో యూనివర్సి టీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. ఈ కోర్సు ల్లో స్పోర్ట్స్‌ విభాగానికి సంబంధించి మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్‌ ప్లానింగ్, స్పోర్ట్స్‌ ఫండింగ్, స్పోర్ట్స్‌ లా, ఎథిక్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారికి అవసరమైన శిక్షణనిచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మణిపూర్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని నెలకొల్పారు. ప్రస్తుతం పూర్తి గా స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌లో శిక్షణ దిశగానే బ్యాచి లర్, పీజీ కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించారు. వీటిలో అందిస్తున్న పీజీ కోర్సుల్లో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌ను కూడా బోధిస్తున్నారు. 

ఐఐఎం రోహ్‌తక్‌లోనూ

మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల పరంగా అంతర్జాతీయంగా పేరున్న ఐఐఎం రోహ్‌తక్‌  రెండేళ్ల వ్యవధిలో ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ దిశగా మరి కొన్ని ఐఐఎం క్యాంపస్‌లు అడుగులు వేస్తున్నాయి. 

WII Jobs : డ‌బ్ల్యూఐఐలో వివిధ పోస్టుల్లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

ఉపాధి వేదికలు 

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రస్తుతం స్పోర్ట్స్‌ అసోసియేషన్స్, స్పోర్ట్స్‌ క్లబ్స్, ట్రైనింగ్‌ అకాడమీలు ముఖ్యమైన ఉపాధి వేదికలుగా నిలు స్తున్నాయి. అదే విధంగా సొంత ఎంటర్‌ ప్రెన్యూర్‌ వెంచర్‌ను కూడా ప్రారంభించొచ్చు. ఇందుకోసం పబ్లిక్‌ రిలేషన్‌ స్కిల్స్‌ ఉపయోగపడతాయి.

జాబ్‌ ప్రొఫైల్స్‌

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తి చేసుకున్న వారికి స్పోర్ట్స్‌ మార్కెటింగ్,  స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, టీమ్‌ మేనేజ్‌మెంట్, ప్లేయర్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్, స్పోర్ట్స్‌ మీడియా మేనేజ్‌మెంట్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.  స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల ఉత్తీర్ణులు.. క్రీడాకారులకు పర్సనల్‌ మేనేజర్స్‌గా వ్యవహరించడంతోపాటు సంస్థల స్థాయిలో పోటీల నిర్వహణ æవంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు, మార్కెటింగ్, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌.. ఇలా ఎన్నో స్పెషలైజ్డ్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

RPO Jonnalagadda Snehaja: సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రహసనమేమీ కాదు.. ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలో ఇవి కీలకం..

జాబ్‌ ప్రొఫైల్స్‌–విధులు 
ప్లేయర్స్‌ మేనేజ్‌మెంట్‌ లేదా స్పోర్ట్స్‌ ఏజెంట్‌ 

ఒక క్రీడాకారుడికి సంబంధించి వ్యక్తిగత బ్రాండింగ్‌ వ్యవహారాలు చూడాల్సి ఉంటంది. అంటే ఈ క్రీడాకారుడికి సంబంధించిన బిజినెస్‌ కాంట్రాక్ట్స్, ఫైనాన్స్, ఎండార్స్‌మెంట్‌ తదితర విధులు వంటివి. వీరికి ప్రారంభంలో క్రీడాకారుడికి ఉన్న డిమాండ్‌ ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం లభిస్తుంది.

స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ 

ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌ విజయవంతం కావాలంటే.. మార్కెటింగ్‌ చాలా ముఖ్యం. దీంతోపాటు స్పాన్సర్స్‌ను గుర్తించడం, సదరు ఆటల పోటీలకు ప్రచారం కల్పించడం వంటి విధులు మార్కెటింగ్‌ మేనేజర్స్‌ నిర్వహిస్తారు. వీరికి కూడా ప్రారంభంలో రూ.50 వేల వరకూ వేతనం అందుతోంది. 

ఈవెంట్‌ మేనేజర్‌

ఒక పోటీ నిర్వహించేందుకు ఎంతో ముందస్తు కసరత్తు  అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఈవెంట్‌ మేనేజర్లు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. ఈవెంట్‌ వేదికను గుర్తించడం నుంచి టీమ్స్‌కు, ఆడియన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాజిస్టిక్స్, టెక్నికల్‌ అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందిస్తారు. వీరికి ప్రారంభంలో రూ.30 వేల వరకు జీతం లభిస్తుంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

టీమ్‌ మేనేజ్‌మెంట్‌

స్పోర్ట్స్‌ కాంపిటీషన్‌ అంటే పలు టీమ్‌లు పాల్గొనడం సహజం. ఆయా బృందాల అవసరా లను గుర్తించి.. వాటిని అందేలా చూడటం, టీమ్‌లోని సభ్యులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి విధులు నిర్వహిస్తారు.

మీడియా మేనేజ్‌మెంట్‌

ఏ ఈవెంట్‌ సక్సెస్‌ కావాలన్నా.. ప్రసార మాధ్యమాల మద్దతు అత్యంత కీలకం. మీడియా మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌.. ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు సంబంధించి తగిన ప్రచారం కల్పించే విధంగా, సదరు ఈవెంట్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ ప్రసారం చేసే విధంగా మీడియాతో సంప్రదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. 

ఆసక్తి తప్పనిసరి

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని యువత ఈ కోర్సువైపు దృష్టి పెట్టడం సహజం. కాని ఈ రంగంలో రాణించాలంటే.. వ్యక్తిగతంగా ఆసక్తి చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.

Specialist Officer : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 253 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఆసక్తి లేకుండా ఈ కెరీర్‌లో ముందుకు సాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.  ఈ రంగంలో కెరీర్‌కు సంబంధించి అనుకూలతలు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కోర్సులో అడుగు పెట్టడం అభిలషణీయం. 

Published date : 21 Nov 2024 01:22PM

Photo Stories