Polytechnic courses:పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు
ఆమదాలవలస : పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్ జేటీఓ గురుగుబెల్లి శ్రీహరి అన్నారు. మండలంలో దన్నానపేట గ్రామం సమీపంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ అచీవర్స్ డేను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు చెందిన 41 మంది విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు రావడంపై అభినందనలు తెలియజేశారు.
Also Read: 'గోరుముద్ద'కు తాజ్ రుచులు.. మెనూ ఇదీ..
వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. పాలిటెక్నిక్‌లో చేరిన విద్యార్థుల్లో నైపుణ్య కల్పన, ఉద్యోగ సాధనలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదువుకోడానికి అస్కారం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఏసీఎల్ ఏజీఎం వీఆర్ పాండా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నెపు గోపి, ఎలక్ట్రానిక్ విభాగాధిపతి పి.శ్రీనివాస్, ఎమ్.మోహన్‌దాస్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.