School Headmaster : విద్యార్థులు మాట వినడంలేదని ఓ గురువు ఆవేదన.. వైరల్ అవుతున్న వీడియో..!!

సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు మాటను వినకపోతే, తల్లిదండ్రులు దండిస్తారు. పాఠశాలల్లో విద్యార్థులు వినకపోతే అక్కడి ఉపాధ్యాయులు దండిస్తారు. కానీ, కొన్నసార్లు విద్యార్థులను శిక్షిస్తే.. ఉపాధ్యాయులకే శిక్షలు పడేలా మారుతుంది. ఈ కారణంగా, ఉపాధ్యాయులు కూడా ఈమధ్యకాలం ఎక్కువశాతం విద్యార్థులను దండించడం లేదు. దీనికి బదులుగా, మంచి చెప్పే ప్రయత్నం చేయడం, వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి క్రమశిక్షణలో పెట్టడం వంటివి చేస్తున్నారు. అయితే, ఇలాంటి ఒక సంఘటన జరిగింది విజయనగరంలోని బొబ్బిలి మండలం, పెంట జడ్పీ హైస్కూల్‌లో.
శిక్ష ఇవ్వకుండానే శిక్షణ.. హెడ్ మాస్టర్ ఆవేదన..
విజయనగరంలో బొబ్బిలి మండలంలో పెంట జడ్పీ హైస్కూల్లోని కొందరు విద్యార్థులు వారి చదువులో విద్యార్థులు తీవ్రంగా వెనకబడుతున్నారని, ఈ విషయంపై వారికి ఎన్ని విధాలుగా ప్రోత్సహం అందించినా ఫలితం లేదన్నారు. అయితే, వారికి ఎన్నివిధాలుగా చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో, విద్యార్థుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా, అక్కడి విద్యార్థులు మాటలు వినకపోవడంతో జెడ్పీ స్పూల్ ప్రధానోపాధ్యాయుడు రమణ వారిని శిక్షించకుండా తానే విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు.
AP EAPCET 2025 Full Details : EAPCET-2025 నోటిఫికేషన్ విడుదల... ముఖ్యమైన తేదీలు ఇవే..
పిల్లలు చదువులో వెనకబడుతున్నారు. నచ్చచెబితే వినడంలేదు, మేము కొట్టలేము తిట్టలేము అసలేం చేయలేం అంటూ ఆ ప్రధానోపాధ్యాయుడు రమణ వాపోయారు. వైరల్ అవుతున్న వీడియోలో తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. విద్యార్థులు ఈరోజు నేర్చుకునే విద్యతోనే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలుస్తారని తెలిపారు. విద్యార్థులు చదువు విలువ తెలుసుకోవాలని కోరారు. ఎందరో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వారి కష్టాల కారణంగా చదువు దక్కడం లేదని, ఇక్కడ చదివే వీలు ఉన్నప్పటికీ విద్యార్థులు పట్టించుకోవడం లేదని అందకనే తనకు తానే శిక్ష వేసుకున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- teachers concern
- zp school headmaster
- viral video of zp school headmaster
- concern for students
- self punishment
- headmaster self punishes for students
- lack of education for students
- ap zp high school
- AP government
- penta zp school head master self punishment
- zp school head master situps
- Penta zp school head master Ramana
- zp school headmaster punishment
- headmaster concern for students education
- zp school students education
- Education News
- Sakshi Education News