Abid Ali: భారత మాజీ క్రికెటర్ అబిద్ అలీ కన్నుమూత

సుదీర్ఘ కాలంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. 1960వ, 1970వ దశకాల్లో భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆబిద్ అలీ అంతర్జాతీయ కెరీర్ ఎనిమిదేళ్ల పాటు సాగింది.
1967–1975 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టుల్లో ఆయన 20.36 సగటుతో 1018 పరుగులు చేశారు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేసర్ అయిన అలీ 42.12 సగటుతో 47 వికెట్లు కూడా పడగొట్టారు.
Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల కన్నుమూత
ఆయన వన్డే కెరీర్ 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. 5 వన్డేలు కలిపి ఆయన 93 పరుగులు చేయడంతోపాటు 7 వికెట్లు తీసుకున్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆబిద్ అలీకి ఘనమైన రికార్డు ఉంది. ఏకంగా 212 మ్యాచ్‌లు ఆడిన ఆయన 8732 పరుగులు చేయడంతో పాటు 397 వికెట్లు తీశారు.
రిటైర్మెంట్ తర్వాత ఆబిద్ అలీ కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కోచింగ్ వైపు మళ్లారు. ఆంధ్ర రంజీ టీమ్‌తో పాటు యూఏఈ, మాల్దీవ్స్ జట్లకు ఆబిద్ అలీ కోచ్‌గా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న తర్వాత అక్కడి నార్త్ అమెరికా క్రికెట్ లీగ్‌లో ఆటను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Padmakar Shivalkar: భారత దిగ్గజ స్పిన్నర్.. పద్మాకర్ శివాల్కర్ కన్నుమూత