Skip to main content

Engineering Fees : రానున్న రోజుల్లో భారీగా పెర‌గ‌నున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఏకంగా 2 ల‌క్ష‌లు..

ఒక‌ప్పుడు విద్యాల‌యాల్లో చేరేందుకు కొన్ని వేల‌ల్లో ఫీజులు ఉండేవి. దానిని, ఏదోరకంగా చెల్లించేవారు విద్యార్థులు, త‌ల్లిదండ్రులు. నాణ్య‌మైన విద్య‌కు లోబ‌డి, ఎంతైనా ఖ‌ర్చు చేస్తుంటారు ప్ర‌జ‌లు.
Big shock to engineering students with huge increase in fees

సాక్షి ఎడ్యుకేష‌న్: ఒక‌ప్పుడు విద్యాల‌యాల్లో చేరేందుకు కొన్ని వేల‌ల్లో ఫీజులు ఉండేవి. దానిని, ఏదోరకంగా చెల్లించేవారు విద్యార్థులు, త‌ల్లిదండ్రులు. నాణ్య‌మైన విద్య‌కు లోబ‌డి, ఎంతైనా ఖ‌ర్చు చేస్తుంటారు ప్ర‌జ‌లు. కానీ, రోజురోజుకి ఫీజుల‌ను భారీగా పెంచేస్తున్నారు విద్యాల‌యాలు, వ‌ర్సిటీలు. ఒక‌ప్పుడు వేల‌ల్లోనే ఉండేవి. ఇప్పుడు ఏ కోర్సులో చేరాల‌న్నా ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే, తాజాగా.. తెలంగాణ‌లోని విద్యార్థులు ఎలాంటి ఇంజినీరింగ్ కోర్సులో చేరాల‌న్నా ల‌క్ష‌ల్లో ఫీజుల‌ను చెల్లించాల్సిందే. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అంటే.. 2025-26 నుంచి ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఫీజులు భారీగా పెరిగిపోయాయి.

AP EAPCET 2025 Full Details : EAPCET-2025 నోటిఫికేషన్‌ విడుదల... ముఖ్య‌మైన తేదీలు ఇవే..

వ‌చ్చే మూడేళ్ల‌లో..

ఈ విద్యాసంవ‌త్స‌రం నుంచి సీబీఐటీ ఏడాది ఫీజును రూ.2.23 లక్షలుగా, వీఎన్‌ఆర్‌, ఎంజీఐటీ తదితర కళాశాలలకు కూడా ట్యూషన్ ఫీజు రూ.2 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మ‌రికొన్ని కాలేజీల్లో మాత్రం ఫీజుల రెట్టింపు అంతంత మాత్రంగానే ఉండ‌డం మ‌రో విశేషం. ఇక‌, వచ్చే మూడేళ్ల బ్లాక్ పిరియడ్‌కు కొత్త రుసుములను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కళాశాలల యాజామాన్యాలు, ప్రతినిధులతో విచారణ నిర్వహించింది.

TGPSC Group 1 Exam Rankers : టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాల్లో వివిధ ర్యాంకులు సాధించిన యువ‌కులు..

కాలేజీలు గతంలో సమర్పించిన గత మూడేళ్ల ఆడిట్ నివేదికలను పరిశీలించి కొత్త ఫీజులను యాజమాన్య ప్రతినిధులకు విచారణ సందర్భంగా కమిటీ తెలిపింది. దాదాపు అన్ని కళాశాలల యాజమాన్యాలు కమిటీ చెప్పిన ఫీజుకు అంగీకరించాయి.

పునఃస‌మీక్ష‌కు అవ‌కాశాలు..

సాంకేతిక‌త కార‌ణంగా గ‌త సంవ‌త్సరంలో ఫీజుల‌ను అంతంత‌మాత్రంగానే పెర‌గ్గా.. దీంతో, ఈసారి ఆయా క‌ళాశాల‌లు ఎక్కువ‌గా పెంచేస్తున్నారని తెలుస్తుంది. విద్యార్థులు ప్ర‌వేశాల కోసం చెల్లించాల్సిన ఫీజులు ఒకవేళ ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే మాత్రం చెల్లింపుల‌పై అధికారులు పునఃసమీక్ష చేయాలని ఆదేశాలొచ్చే అవకాశాలు లేక‌పోలేద‌ని నిపుణులు చెబుతున్నారు.

SSC CPO Tier -II Answer Key: SSC CPO టైర్‌-II ఆన్సర్ కీ 2025 ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి... అభ్యంతరాల గడువుకు చివరి తేదీ ఇవే..

ఈ ఫీజులు గ‌న‌క పెరిగితే మాత్రం త‌ల్లిదండ్రుల‌కు భారీగా క‌ష్టాలు మొద‌లైన‌ట్లే. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచుకోవాల‌ని, వివిధ కోర్సులతో ఉద్యోగాల‌తో ముందుకెళ్ళాల‌నే ఆశ‌యాలు ఉంటే, ఈ ఫీజులు చెల్లించ‌లేక ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు కొంద‌రు విద్యార్థులు త‌ల్లిదండ్రులు. కాగా, ఏ నిర్ణ‌యం తీసుకున్న ఈ విష‌యాల‌ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల‌ని కోరుతున్నారు విద్యార్థులు, త‌ల్లిదండ్రులు.

కళాశాల పేరు పాత ఫీజు కొత్త ఫీజు
సీబీఐటీ రూ.1.65 లక్షలు రూ.2.23 లక్షలు
వీఎన్‌ఆర్‌ రూ.1.35 లక్షలు రూ.2.20 లక్షలు
వాసవి రూ.1.40 లక్షలు రూ.2.15 లక్షలు
ఎంజీఐటీ రూ.1.60 లక్షలు రూ.2 లక్షలు
సీవీఆర్ రూ.1.50 లక్షలు రూ.1.98 లక్షలు
ఎంవీఎస్‌ఆర్ రూ.1.30 లక్షలు రూ.1.60 లక్షలు
మాతృశ్రీ రూ.లక్ష రూ.1.02 లక్షలు
జేబీఐటీ రూ.1.10 లక్షలు రూ.1.15 లక్షలు
జేబీఆర్‌ఈసీ రూ.87 వేలు రూ.1.06 లక్షలు
స్టాన్లీ మహిళ రూ.85 వేలు రూ.95 వేలు
మెథడిస్ట్ రూ.78 వేలు రూ.86 వేలు

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Mar 2025 12:27PM

Photo Stories