1,000 Jobs: క్రెడిట్ ఆఫీసర్ వయా పీజీడీబీఎఫ్.. రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్!

పోస్టుల సంఖ్య 1000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఓపెన్ కేటగిరీలో 405 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 100 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 270 పోస్టులు, ఎస్‌సీ కేటగిరీలో 150 పోస్టులు, ఎస్‌టీ కేటగిరీలో 75 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
- నవంబర్ 30, 2024 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం మార్కుల సడలింపు లభిస్తుంది.
- వయసు: నవంబర్ 30, 2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
పీజీడీబీఎఫ్ పూర్తి చేస్తేనే
కెడిట్ ఆఫీసర్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నియామకాల ఖరారులో వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. పలు ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి ఏడాది వ్యవధిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును అందిస్తోంది. ఈ వ్యవధిలో 9 నెలలు థియరీ శిక్షణ, మరో మూడు నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరిట బ్యాంక్ బ్రాంచ్‌లలో శిక్షణనిస్తారు. క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన వారు తప్పనిసరిగా ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి బ్యాంకులో శాశ్వత కొలువు ఖరారు చేస్తారు. పీజీడీబీఎఫ్ కోర్సు చదువుతున్నప్పుడే ఐఐబీఎఫ్ నిర్వహించే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్/జేఏఐఐబీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: BOM Job Openings: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్!
కోర్సు ఫీజు తిరిగి చెల్లింపు
పీజీడీబీఎఫ్ కోర్సు ఫీజు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. బ్యాంకులో అయిదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అంటే దాదాపుగా అభ్యర్థులు ఉచితంగా పీజీడీబీఎఫ్ కోర్సును పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది. ఎంపికైన విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంక్‌ల నుంచి ఎడ్యుకేషన్ లోన్ మంజూరుకు తోడ్పాటును అందిస్తారు.
స్టయిఫండ్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక ప్రక్రియ ద్వారా పీజీడీబీఎఫ్ కోర్సులో సీటు ఖరారు చేసుకుంటే.. స్టయిఫండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఏడాది వ్యవధిలోని కోర్సు సమయంలో 9 నెలల క్లాస్ రూం లెర్నింగ్ వ్యవధిలో నెలకు రూ.2,500, మూడు నెలల ఆన్ జాబ్ ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.10 వేలు చొప్పున స్టయిఫండ్ లభిస్తుంది.
![]() ![]() |
![]() ![]() |
నెలకు రూ.70 వేల వేతనం
పీజీడీబీఎఫ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని.. క్రెడిట్ ఆఫీసర్ హోదాలో కొలువు సొంతం చేసుకున్న వారికి జేఎంజీఎస్–1 స్కేల్‌లో వేతనం అందిస్తారు. నెలకు రూ.70 వేల వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది.
రెండంచెల ఎంపిక ప్రక్రియ
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి మార్గం వేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశానికి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ.
4 విభాగాల్లో రాత పరీక్ష
పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష 120 ప్రశ్నలు–120 మార్కులకు నాలుగు విభాగాల్లో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్) 30 ప్రశ్నలు–30 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి గంటన్నర.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్
రాత పరీక్షలో భాగంగానే డిస్క్రిప్టివ్ విధానంలో 30 మార్కులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లెటర్ రైటింగ్ (15 మార్కులు), ఎస్సే రైటింగ్ (15 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా 50 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పీజీడీబీఎఫ్ కోర్సుకు నిర్దేశించిన సీట్లకు మూడు రెట్లకు సమానమైన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
జీఎం స్థాయికి
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్‌లో కొలువుదీరిన వారు భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంది. పదోన్నతులను పరిగణనలోకి తీసుకుంటే.. మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం, జనరల్ మేనేజర్, సీజీఎం స్థాయి వరకు చేరుకోవచ్చు. బ్యాంకు సర్వీస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. జీఎం స్థాయికి తప్పనిసరిగా చేరుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025, ఫిబ్రవరి 20
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in/en/recruitments
రాత పరీక్షలో రాణించేలా
ఇంగ్లిష్ లాంగ్వేజ్: గ్రామర్ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్‌లను ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: క్వాంటిటేటివ్ ఆప్టి ట్యూడ్‌కు సంబంధించి మ్యాథమెటిక్స్‌లోని కోర్ అంశాలతోపాటు అర్థమెటిక్ అంశాలు (నిష్పత్తు లు, శాతాలు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వ ర్క్, యావరేజెస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, కూడికలు, గుణకారాలు తదితర)పై దృష్టి పెట్టాలి.
రీజనింగ్ ఎబిలిటీ: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, డైరక్ష న్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, డబుల్ లైనప్, డయాగ్రమ్స్, ఫ్లో చార్స్‌లను ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో మంచి మార్కుల కోసం కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ఎకానమీకి సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామా లు తెలుసుకోవాలి. బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపంతోపాటు తాజా పరిణా మాలు, బ్యాంకింగ్ టెర్మినాలజీపై అవగా హన పెంచుకోవాలి. కంప్యూటర్/ఐటీ అవేర్‌నెస్ కోసం కంప్యూటర్ ఆపరేషన్ టూల్స్‌పై పట్టు సాధించాలి.
Tags
- Credit Officer Jobs
- Central Bank of India
- Post-Graduate Diploma in Banking & Finance
- PGDBF
- Central Bank Credit Officer Recruitment 2025 Notification
- Central Bank Credit Officer Recruitment 2025
- Central Bank of India Credit Officer Recruitment 2025
- Central Bank of India Recruitment 2025 Notification
- Credit officer via pgdbf salary
- Credit officer via pgdbf syllabus
- Credit officer via pgdbf qualification
- Credit officer via pgdbf eligibility
- Jobs
- latest jobs
- 1000 Jobs
- Central Bank job notifications2025
- Banking career2025