Skip to main content

BOM Job Openings: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్!

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
apply bank of maharashtra 172 managerial posts  Bank of Maharashtra recruitment notification 2025

పోస్టుల వివరాలు

  1. జనరల్ మేనేజర్ (డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్): 01 పోస్ట్
  2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (IT ఎంటర్‌ప్రైజ్ & డేటా ఆర్కిటెక్ట్): 01 పోస్ట్
  3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (IT & డిజిటల్ ప్రాజెక్ట్స్): 01 పోస్ట్
  4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్): 03 పోస్టులు
  5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (DevSecOps): 01 పోస్ట్
  6. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (API & ఇంటర్‌ఫేస్): 01 పోస్ట్
  7. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మిడిల్‌వేర్): 01 పోస్ట్
  8. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్): 01 పోస్ట్
  9. చీఫ్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ): 01 పోస్ట్
  10. చీఫ్ మేనేజర్ (IT క్లౌడ్ ఆపరేషన్స్): 01 పోస్ట్
  11. చీఫ్ మేనేజర్ (IT ఇన్ఫ్రాస్ట్రక్చర్): 01 పోస్ట్
  12. చీఫ్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్): 01 పోస్ట్
  13. సీనియర్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ): 03 పోస్టులు
  14. సీనియర్ మేనేజర్ (డేటా స్పెషలిస్ట్): 05 పోస్టులు
  15. మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్): 05 పోస్టులు
  16. మేనేజర్ (నెట్‌వర్క్ & సెక్యూరిటీ): 03 పోస్ట్‌లు
  17. మేనేజర్ (డిజిటల్ ఛానల్): 02 పోస్టులు

వయో పరిమితి:

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస వయోపరిమితి 22 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం:

అర్హులైన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ/ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థి యొక్క అర్హతలు, అనుకూలత/ అనుభవం మొదలైన వాటికి సంబంధించి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం కొరకు బ్యాంక్ మొదట అప్లికేషన్లను ప్రాథమికంగా స్క్రీనింగ్ చేస్తారు. అనంతరం, వ్యక్తిగత ఇంటర్వ్యూ/ డిస్కషన్ లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూకు మార్కుల కేటాయింపు 100. ఇంటర్వ్యూలో అర్హత సాధించడానికి అభ్యర్థి కనీసం 50 మార్కులు (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులైతే 45) సాధించాలి.

దరఖాస్తు ఫీజు

  • జనరల్/EWS/OBC కేటగిరీలకు దరఖాస్తు రుసుము: రూ. 1180
  • SC/ST/PWBD వర్గాలకు దరఖాస్తు రుసుము: రూ. 118
  • ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లింపులు జరపాలి.

అప్లికేషన్‌కు చివరి తేది:

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 29న ప్రారంభమైంది. అప్లై చేయడానికి ఆఖరు తేదీ 2025 ఫిబ్రవరి 17. 

Full Details: 172 Vacancies| Bank of Maharashtra Recruitment 2025: Officer Positions

>> SIDBI Recruitment: సిడ్బీలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 03 Feb 2025 09:40AM

Photo Stories