CIPET Admissions: ‘సిపెట్’ కోర్సులకు దరఖాస్తు గడువు తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: భారత ప్రభుత్వ విద్యాసంస్థ ‘సిపెట్’ విజయవాడలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి పాసైన విద్యార్థులు మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), బీఎస్సీ విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ–పీపీటీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక హాస్టల్ వసతి ఉందని, అర్హులైన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.
చదవండి: Andhra Pradesh: కొలువు.. చాలా సులువు.. CIPETలో లభిస్తున్న కోర్సులు ఇవే..
ఆసక్తి గల విద్యార్థులు మే 31వ తేదీ లోగా https://cipet24. onlineregistrationform.org/CIPET/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జూన్ 9న సిపెట్ అడ్మిషన్ టెస్ట్ (సీఏటీ) విజయవాడ, అనంతపురంలో నిర్వహించి, ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లను భర్తీ చేస్తామని వివరించారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్ రంగంలో గల బహుళ జాతి సంస్థల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఇతర సమాచారం కోసం 9398050255 నంబర్‌లో సంప్రదించాలని శేఖర్ విజ్ఞప్తి చేశారు.
Published date : 23 May 2024 05:34PM