Skip to main content

IIT-Madras Announced New Course: ఐఐటీ మద్రాస్ లో కొత్త కోర్సు

సాక్షి, చెన్నై: మద్రాసు ఐఐటీలో ఫైన్ ఆర్ట్స్, కల్చర్ ఎక్సలెన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 2025-26కు పరిచయం చేశారు.
Culture Excellence and Graduation course at IIT Madras

దేశంలో ఈ ప్రోగ్రామ్లకు శ్రీకారం చుట్టిన తొలి విద్యా సంస్థ తమదేనని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి. కామకోటి తెలిపారు. అన్ని బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్లకు రెండు సీట్లు చొప్పన కేటాయించామని ప్రకటించారు. ఇందులో ఒక సీటు మహిళకు రిజర్వుడ్ చేశామన్నారు.

డిసెంబ‌ర్ 18న‌ స్థానికంగా ఐఐటీ మద్రాస్ డీన్ (స్టూడెంట్స్) సత్యనారాయణ ఎన్ గుమ్మడితో కలిసి ఈ వివరాలను కామకోటి ప్రకటించారు. ఫేస్ అడ్మిషన్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

చదవండి: IIT Madras: కేవలం రూ. 500కే డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కోర్సులు

ఐఐటీ మద్రాసు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ఒకటిగా ఈ ఫేస్ అడ్మిషన్ల ద్వారా భారత సం తతికి చెందిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఐఐటీఎం, ఫేస్ అడ్మిషన్ పోర్టల్ (https://jeeadv.iitm.ac.in/face) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింటుందని సూచించారు.

ఐఐటీ మద్రాసులోని వివిధ విద్యా కార్యక్రమాలలో ప్రవేశానికి మాత్రమే ఈ ఫేస్ ప్రవేశం కింద అడ్మిషన్ పోర్టల్ను ఉపయోగించాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Dec 2024 06:17PM

Photo Stories