Skip to main content

IIT Madras: కేవలం రూ. 500కే డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కోర్సులు

IIT Madras Online Certificate Course  IIT Madras Data Science and AI Program   Application Deadline Extension  Application Process for IIT-Madras Data Science and AI Program
IIT Madras Online Certificate Course

దేశంలోనే అత్తుత్యమ విద్యాసంస్థగా పేరొందిన ఐఐటీ-మద్రాస్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో  ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్‌ లేదా 12వ తరగతి పాసైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అప్లికేషన్లకు అక్టోబర్‌ 4(నేడు)తో గడువు ముగియనుండా, ఇప్పుడు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఒక్కో కోర్సుకు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

Agriculture Course: సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇప్పటికే 500కు పైగా పాఠశాలలు ఈ సర్టిఫికేషన్‌ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోగా, 11వేల మంది మందికి పైగా విద్యార్థులు పలు బ్యాచ్‌లలో వివిధ కోర్సుల్లో అడ్మీషన్‌ పొందారు. డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులకు ఏ స్ట్రీమ్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ కోర్సుకు మాత్రం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అభ్యసిస్తున్నవారే అర్హులు. 

సుమారు నాలుగు నుంచి ఎనిమిది వారాల పాటు ఈ ట్రైనింగ్‌ సెషన్‌ ఉంటుంది.ఈ కోర్సులో వీడియో లెక్చర్స్, అసైన్‌మెంట్స్, ప్రొఫెసర్స్, కోర్స్ ఇన్‌స్ట్రక్టర్స్‌తో లైవ్‌ ఇంటరాక్షన్స్‌తో ఉంటాయి. నెలకు ఒకసారి శని/ఆదివారాల్లో లైవ్‌ ఇంటరాక్షన్‌ ఉంటుంది. గడువు లోగా విద్యార్థులు కంటెంట్‌ వీడియోలను చూడటంతో పాటు తమ అసైన్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.ఒక్కో అసైన్‌మెంట్‌కు కనీసం 40శాతం మార్కులు తప్పనిసరిగా స్కోరు చేయాలి.

MBA And MCA Counseling: ఈనెల 5న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్‌

మొత్తం 4 అసైన్‌మెంట్‌లలో మూడింట్లో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ఎనిమిది వారాల ఆన్‌లైన్‌ కోర్సు పూర్తయిన తర్వాత పాసైన విద్యార్థులకు ఈ-సర్టిఫికెట్‌లను పంపిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 04 Oct 2024 01:35PM

Photo Stories