Skip to main content

Teachers Recruitment: గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌ పోస్టుల భర్తీకి..

Teachers jobs  Teachers   Appeal to replace vacant teacher posts   posts vacant in agency area
Teachers jobs

సాక్షి ఎడ్యుకేష‌న్: గ‌త కొంత కాలంగా ఏజెన్సీ ప్రాంతంలో టీచ‌ర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, వాటి మ‌రి కొంద‌రి అర్హుల‌తో భ‌ర్తీ చేసేందుకు ఆదివాసి గిరిజ‌న విద్యార్థి సంఘం ఆధ్వ‌ర్యంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు ఈ విన‌తీ ప‌త్రం ఇచ్చారు. అయితే, విద్యార్థి సంఘం అందించిన ఈ వినతీ ప‌త్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

TSPSC Group 2 exam New Rules: గ్రూప్‌ 2 పరీక్షలకు కొత్త నిబంధనలు: Click Here

ఈ సంద‌ర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్‌ సంతోష్ మాట్లాడుతూ.. గాదిగూడ మండలంలోని గోదురుగూడ, పున్నగూడ, కట్టగూడ, లోద్దిగూడ, సాంగ్వి, పున్నగూడ వంటి గ్రామాల్లో టీచ‌ర్లు లేక విద్యార్థులకు విద్య, శిక్ష‌ణ అందకుండా పోతుంద‌ని వారి కోసం ఉపాధ్యాయుల భ‌ర్తీకి ఎంపిక‌ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పీవోను కలిసిన వారిలో నాయకులు కుంరం కోటేశ్వరావు, మరప గంగారాం, తదితరులు ఉన్నారు.
 

Published date : 16 Dec 2024 09:24AM

Photo Stories