Skip to main content

Agriculture Course: సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Agriculture Course  Dr. Veeraiah, district coordinator of Krishi Vigyan Kendra, speaking about agricultural education  Universal Distance Education Center at Acharya NG Ranga Agricultural University, Guntur Certificate courses in agriculture available for application  Agricultural education opportunities at Acharya NG Ranga Agricultural University Kadapa agriculture discussion led by Dr. Veeraiah

కడప అగ్రికల్చర్‌ : గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో సార్వత్రిక దూర విద్యా కేంద్రం ద్వారా వ్యవసాయ విద్యకు సంబంధించి సర్టిఫికెట్‌ కోర్సులు చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వీరయ్య తెలిపారు.

అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్‌ సర్టిఫికె ట్‌ కోర్సులైన చిరుధాన్యాలు, సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టు తయారీ, తేనెటీగల పెంపకానికి సంబంధించి 8 వారాల వ్యవధిలో శిక్షణ నిర్వహిస్తారని తెలిపారు.

Free training: కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఇంటర్య్వూ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ..15వేల జీతం కూడా

అభ్యర్థులు ఒక్కో కోర్సుకు రూ. 1500 చొప్పున ఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ సదుపాయం (కంప్యూటర్‌ లేదా ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌, ఐపాడ్‌) కలిగి ఉండాలని తెలిపారు.

Vice Chancellor Posts: వైస్‌చాన్స్‌లర్‌ పోస్టులకు భారీగా దరఖాస్తులు

ఆసక్తిగల వారు తమ పేర్లను అక్టోబర్‌ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు వ్యవసాయ విశ్వ విద్యాలయం వెబ్‌సైట్‌ www.angrau.ac.in ను సందర్శించి తెలుసుకోవచ్చన్నారు. లేదా 8008788776, 8309626619, 8096085560 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Published date : 04 Oct 2024 06:26PM

Photo Stories