Skip to main content

job mela: రేపు జాబ్‌ మేళా

tomorrow job mela   job mela for unemployed youth in vijayawada
tomorrow job mela

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా లోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు 13వ తేదీ శుక్రవారం జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎన్టీఆర్‌ జిల్లా అధికారి ఎస్‌.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

10వ తరగతి Inter అర్హతతో ONGCలో 2236 ఉద్యోగాలు: Click Here

విద్యాధరపురం రోటరీ నగర్‌లోని కబేళా దగ్గర ఉన్న బీసీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ ఆవరణలో ఉన్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్యాలయంలో ఈ జాబ్‌మేళా జరుగుతుందని తెలిపారు. నవతా ట్రాన్స్‌పోర్ట్‌, ఇన్నోసోర్స్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఆర్‌ఆర్‌ ట్రేడర్స్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చర్స్‌, ఎస్‌బీఐ పేమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొదలైన కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని, వారి కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేస్తారని వివరించారు.

పది, ఇంటర్‌, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 18 నుంచి 38 ఏళ్ల లోపు వయస్సు వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న వారు శుక్రవారం ఉదయం 10 గంటలకు జరిగే జాబ్‌మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా ఆయన తెలిపారు. వివరాలకు 97000 25833లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

Published date : 12 Dec 2024 05:27PM

Photo Stories