Skip to main content

NHPC jobs: డిగ్రీ అర్హతతో NHPCలో భారీగా ఉద్యోగాలు జీతం నెలకు 80000

NHPC jobs
NHPC jobs

భారత ప్రభుత్వ నవరత్న ఎంటర్ ప్రైస్ అయినటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్  ( NHPC ) లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

10వ తరగతి , ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల: Click Here

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఆఫీసర్ (హెచ్ఆర్) , ట్రైనీ ఆఫీసర్ (పిఆర్) , ట్రైనీ ఆఫీసర్ (లా) , సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 118

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

ట్రైనీ ఆఫీసర్ ( హెచ్ ఆర్) – 71  
ట్రైనీ ఆఫీసర్ ( పి ఆర్)  – 10
ట్రైనీ ఆఫీసర్ ( లా)  – 12
సీనియర్ మెడికల్ ఆఫీసర్ – 25 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత :
ట్రైనీ ఆఫీసర్ ( హెచ్ఆర్) : 
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ , సంబంధిత విభాగంలో 60 శాతం  రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా తత్సమాన అర్హత

ట్రైనీ ఆఫీసర్ (పిఆర్) :
కమ్యూనికేషన్స్ / మాస్ కమ్యూనికేషన్ / జర్నలిజం / పబ్లిక్ రిలేషన్స్ విభాగం లో 60 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి వుం డాలి.

ట్రైనీ ఆఫీసర్ (లా) : 
60 శాతం మార్కులతో  లా విభాగంలో  గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.

సీనియర్ మెడికల్ ఆఫీసర్:
వాలిడ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు రెండు సంవత్సరాల అనుభవం వున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :
ట్రైనీ ఆఫీసర్ ( హెచ్ఆర్)  & ట్రైనీ ఆఫీసర్ ( పిఆర్) ఉద్యోగాలకు 30 సంవత్సరాలు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రైనీ ఆఫీసర్ (లా) , సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
ఓబీసీ వారికి 3 సంవత్సరాలు 
దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.  
          
ఎంపిక విధానం :
అభ్యర్థులను యుజిసి నెట్ స్కోరు మరియు ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
యుజిసి నెట్ స్కోరు కు 75 శాతం , ఇంటర్వ్యూ కి 25 శాతం వెయిట్ ఏజ్ లభిస్తుంది.

జీతం: అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా సుమారు 80,000/- రూపాయల జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 09/12/2024.
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 30/12/2024.


👉  Click Here For Notification

👉 Click Here to Apply
 

Published date : 12 Dec 2024 06:49PM

Photo Stories