Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
కాశీబుగ్గ: పలాసలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 13న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పైల జవహర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మశీ, నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్, పేటీఎం సంస్థలకు అభ్యర్థులకు ఎంపిక చేస్తారని తెలిపారు.
Job Mela Job Mela for freshers
ఐటీఐ, డిగ్రీ, ఫార్మసీ విద్యార్హతలు కలిగి 18–35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఆధార్ కార్డు నకళ్లు, విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, పాస్‌పోర్ట్ ఫొటోలు, ఫార్మల్ డ్రస్‌లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు 6301046329 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం
ఎప్పుడు: డిసెంబర్ 13న ఎక్కడ: ప్రభుత్వ ఐటీఐ కళాశాల